ఆయిల్ పామ్ సాగుతో 40 ఏళ్లు ఆదాయం: మంత్రి తుమ్మల

​కలం, ఖమ్మం బ్యూరో: ఎల్ నినో ప్రభావం దృష్ట్యా రైతులు సాంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి తక్కువ కాలపరిమితి కలిగిన పంటల వైపు మళ్లాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageswara Rao) పిలుపునిచ్చారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు 40 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం లభిస్తుందన్నారు. సాగు చేసే రైతులకు ఎకరాకు రూ. 50వేల ప్రోత్సాహకంతో పాటు ఉచితంగా డ్రిప్ పరికరాలు, అంతర పంటగా కూరగాయలు వేస్తే అదనంగా రూ.2 వేలు కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పుఠానితండాలో రూ.3.30 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు కలెక్టర్ దివాకర టి.ఎస్.తో కలిసి శంకుస్థాపన చేశారు.

రహదారుల అభివృద్ధికి రూ.75 కోట్లు..

​ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రఘునాథపాలెం మండలంలో రహదారుల అభివృద్ధికి రూ.75 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. త్వరలోనే 200 రోడ్లకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. పోడు భూములకు పట్టాలు పొందిన రైతులకు బోర్లు, విద్యుత్ కనెక్షన్లు కల్పిస్తామన్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు దరఖాస్తు చేసుకున్న రోజే బోర్ వెల్ అనుమతులు మంజూరు చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 10న మండల కార్యాలయంలో ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>