కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధం ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెప్పాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin) డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని మోదీ తీరును ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. యుద్ధం వద్దంటూ ట్రంప్‌కు చెప్పాలని పేర్కొన్నారు.
అలాగే, విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొని, తిరిగి వెళుతున్న ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనాపై దాడికి సంబంధించిన అన్ని విషయాలను ప్రధాని వెల్లడించాలని డిమాండ్ చేశారు. భారత ఆయిల్ దిగుమతులపై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలను ఒవైసీ ప్రస్తావిస్తూ.. దీనిపై బీజేపీ–ఆర్ఎస్ఎస్ గట్టి బదులివ్వాలని అన్నారు. తనకు నచ్చిన చోట నుంచి ఆయిల్ కొనే అధికారం భారత్‌కు ఉందని అమెరికాకు గట్టి సమాధానమివ్వాలని ఒవైసీ(Asaduddin) డిమాండ్ చేశారు.

