కలం, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ (TGPSC) గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్లానింగ్, స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 102 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. అర్హులైన అభ్యర్థుల నుంచి అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2026 జూలై 1 నాటికి కనిష్ఠంగా 18 ఏళ్లు, గరిష్ఠంగా 44 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ వేతన స్కేలు రూ.36,750 నుంచి రూ.1,06,990 వరకు ఉంటుంది. విద్యార్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ (TGPSC) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కమిషన్ సూచించింది. దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను పరిశీలించి, అర్హతలను నిర్ధారించుకోవాలని స్పష్టం చేసింది.
Also Read : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ సెటైర్లు
Follow Us On: Youtube

