కలం, నిర్మల్: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు టీజీఎన్‌పీడీసీఎల్ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నిర్మల్ (Nirmal) సర్కిల్ పరిధిలోని అక్కాపూర్ 220/132 కేవీ సబ్‌స్టేషన్ (Akkapur Substation) లో అదనంగా 160 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ (160 MVA Transformer) ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను నోడల్ అధికారి, జీఎం గోపికృష్ణ మంగళవారం పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
అదనపు ట్రాన్స్‌ఫార్మర్ అందుబాటులోకి వస్తే సబ్‌స్టేషన్ పరిధిలో పెరుగుతున్న విద్యుత్ లోడ్‌ను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు సరఫరా సామర్థ్యం మెరుగుపడుతుందని అన్నారు. వ్యవసాయ సీజన్‌తో పాటు రానున్న వేసవిలో పెరిగే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సబ్‌స్టేషన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్ల సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

