కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీ (Rayadurgam Knowledge City) లేఅవుట్‌లో భూములను విక్రయించేందుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని సర్వే నంబర్ 83/1 లో గల బహుళ వినియోగ భూములను ఇ-వేలం ద్వారా విక్రయించనున్నారు. ఎకరం కనీస ధరను 139 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రెండు ప్లాట్లకు సంబంధించి 6.29 ఎకరాలు, 5.09 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాలు ఈ వేలంలో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల బిడ్డర్లు మే 18వ తేదీన రాయదుర్గంలోని టీ-హబ్ వద్ద నిర్వహించే ప్రీ-బిడ్ సమావేశానికి హాజరుకావచ్చు. వేలం ప్రక్రియ మే 28, జూన్ 1వ తేదీల్లో జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
Read Also: 9న బెంగాల్ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం: ఆ కీలక నేత ఎవరు?
Follow Us On : WhatsApp

