కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2026 పరీక్షల ఫలితాలు (TG TET Result) విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం మధ్యాహ్నం ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.
ఈ ఏడాది నిర్వహించిన టీజీ టెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,15,028 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో జరిగిన ఈ పరీక్షల ఫలితాల్లో అభ్యర్థుల మార్కులు, అర్హత సాధించారా లేదా అనే వివరాలతో కూడిన స్కోర్‌కార్డులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజల్ట్స్ కోసం https://tgtet.aptonline.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా అధికారులు సూచించారు.
Read Also: పాలిటిక్స్‌లోకి ఎన్టీఆర్.. క్లారిటీ ఇచ్చిన టీం
Follow Us On: X(Twitter)

