బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు ఫూలే: బీసీ సంఘం

కలం, నిర్మల్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే (Jyotirao Phule) అని నిర్మల్ (Nirmal) జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంబడి చంద్రశేఖర్ అన్నారు. శనివారం మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలో మహాత్మా జ్యోతిరావు ఫూలేకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలు, మూఢనమ్మకాలను తొలగించేందుకు ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడుతూ సంఘ సంస్కర్తగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని పేర్కొన్నారు. మహిళా విద్యకు విశేష ప్రాధాన్యతనిచ్చి తన సతీమణి సావిత్రిబాయి ఫూలేను దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దడమే కాకుండా, మహిళల విద్యాభివృద్ధికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు జీవన్‌, నాయకులు రామకృష్ణ, రాము, శోభన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>