కలం, వెబ్ డెస్క్ : అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు (Telugu Student murder) గురయ్యాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన అన్షుల్ కుంచా (Anshul Kuncha) ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. న్యూయార్క్ లో ఆన్ లైన్ డెలివరీ చేస్తున్న సమయంలో అన్షుల్ పై కాల్పులకు ఒడిగట్టగా అతడు అక్కడికక్కడే మరణించాడు.
అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన అన్షుల్ జీవనోపాధి కోసం పిజ్జా డెలివరీ బాయ్ గా పని చేస్తున్నారు. శుక్రవారం అర్దరాత్రి పిజ్జా డెలీవరీ చేసే క్రమంలో విషాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. అన్షుల్ హత్య విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అన్షుల్ ను స్వగ్రామానికి తీసుకురావాలని వారు కోరుతున్నారు.

