కలం, వెబ్డెస్క్: నల్లగొండలోని ఎన్జీ కాలేజ్(NG College) వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి (Telangana Thalli Statue) ఇందిరమ్మ చీర కట్టిన ఘటన వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహానికి ఇందిరమ్మ చీర కట్టడంపై తెలంగాణ వాదులు (Telangana Activists) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ వాదులు.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని శుద్ధి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లిని అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ తల్లి గౌరవాన్ని కాపాడాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read : 20 కోట్ల ఓట్ల తొలగింపే బీజేపీ లక్ష్యం: సీఎం రేవంత్
Follow Us On : WhatsApp

