సచివాలయం వద్ద ఉద్యోగుల భారీ నిరసన.. ఎందుకంటే!

కలం, వెబ్ డెస్క్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం ప్రధాన ద్వారం వద్ద సచివాలయ ఉద్యోగులు (Secretariat Employees) అకస్మాత్తుగా ధర్నాకు దిగారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్‌ల విడుదల, రెండవ పీఆర్‌సీ (PRC) అమలు, బకాయి పడిన కరవు భత్యాలు (DA) వెంటనే మంజూరు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

వీటితో పాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో సరిగ్గా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రధాన గేటు ఎదుట ఉద్యోగులు బైఠాయించడంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీలను నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>