రెండు వారాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం.. కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో 2025-26 రబీ (Rabi) సీజన్ ధాన్యం కొనుగోళ్లు (Paddy Procurement) మరో రెండు వారాల్లో షురూ కానుంది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర (IPS) పౌరసరఫరాల భవన్‌లో జిల్లా కలెక్టర్లతో, రాష్ట్ర రైస్ మిల్లర్లతో శనివారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అదనపు గోదాములను వెంటనే గుర్తించి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లందరినీ ఆదేశించారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) ధాన్యం కొనుగోళ్లకు ముమ్మర ఏర్పాట్లు చేయాలని వెల్లడించారు.

అంతేకాదు క్షేత్రస్థాయిలో రవాణా ఏర్పాట్లు, రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ధాన్యం అన్‌లోడ్ చేయడంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా, అన్ని కొనుగోలు కేంద్రాల్లో తగినంత మంది హమాలీలను (కార్మికులను) ఏర్పాటు చేయాలని అధికారులు, మిల్లర్లను ఆదేశించారు.ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ధాన్యం సేకరించడానికి రైస్ మిల్లర్లు పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.

ఈ సీజన్‌లో ధాన్యం ప్యాకింగ్ అవసరాలను తీర్చడానికి, గోనెసంచుల కేటాయింపులపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. మిల్లర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న 35 కోట్ల పాత గోనెసంచులలో కనీసం 10 కోట్ల సంచులను వెంటనే జిల్లా మేనేజర్లకు అప్పగించాలని ఆదేశించారు. దీనిద్వారా రబీ సీజన్ ప్యాకింగ్ అవసరాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) లెక్కలను ఇప్పటికే అధికారులు ఖరారు చేశారు.10 శాతం నూకల మినహాయింపుతో కలిపి 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుండి 3.5 లక్షల మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కేటాయింపులకు ఆమోదం లభించింది.

మిల్లింగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం. 10 జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్ ఛార్జీలను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలు అలాగే పెండింగ్ సమస్యలపై మిల్లర్ల నుండి కమిషనర్ వినతిపత్రాలను స్వీకరించారు.ఈ విన్నపాలను నిశితంగా పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన మిల్లర్లకు హామీ ఇచ్చారు. దీంతో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా,సమర్థవంతంగా జరిగేలా పౌరసరఫరాల శాఖ ముమ్మర ఏర్పాట్లు చేయనుంది.

Read Also: పథకాలు ప్రజలకు చెందినవి.. పాలకులవి కావు : మంత్రి తుమ్మల

Follow Us On : WhatsApp

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>