కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త అందుతోంది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Police Notification) విడుదల చేసింది. మొత్తం 7,437 పోస్టులకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ను జారీ చేసింది.
ఇందులో భాగంగా 3,697 సివిల్ , 1,052 ఆర్మ్డ్ రిజర్వ్ (AR) , 1,380 స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) కానిస్టేబుల్ పోస్టులను తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయనుంది. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్లో 751, జైళ్ల శాఖలో 200 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. 148 సివిల్ ఎస్ఐ, 14 ఏఆర్ ఎస్ఐ, 12 టీజీఎస్పీ ఎస్ఐ పోస్టులను ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియలకు సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ తెలిపింది.
Read Also: ఐసీసీ ర్యాంకింగ్స్లో వైభవ్ సూర్యవంశీ 230 స్థానాల జంప్
Follow Us On : WhatsApp

