నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2,000 ఉద్యోగాలపై కసరత్తు!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు పోలీస్ శాఖ (Telangana Police) గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమౌతోంది. రాష్ట్రంలో పోలీస్ సేవలను మరింత విస్తృత పరిచేందుకు కొత్త హోమ్ గార్డ్ ల నియామకంపై కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోపోలీసు శాఖను మరింత బలోపేతం చేయడం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నూతన రిక్రూటింగ్ పై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ దృష్టి సారించారు.

ఈ మేరకు శుక్రవారం ఆయన ఉన్నతాధికారులతో ‘మినీ స్టాఫ్ ఆఫీసర్స్’ సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్ శాఖలో 2,000 హోంగార్డుల (Home Guard Jobs) రిక్రూట్‌మెంట్ అంశంతో పాటు పలు కీలక అంశాలపై సమీక్షించారు. కొత్తగా 2 వేల మంది హోంగార్డుల నియామకం, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలపై అధికారులు చర్చించారు. ప్రస్తుతం పోలీసు శాఖలో మంజూరైన సిబ్బంది సంఖ్యను పునఃసమీక్షించాల్సిన విషయంపై చర్చించారు.

మినీ స్టాఫ్ ఆఫీసర్స్ (Mini Staff Officers) సమావేశంలో వచ్చే నెలలో నిర్వహించనున్న పోలీస్ రిట్రీట్, మహిళా పోలీస్ అధికారుల సదస్సు నిర్వహణపై చర్చించారు. అంతేకాకుండా ⁠నూతన తెలంగాణ పోలీస్ (Telangana Police) మాన్యువల్ రూపకల్పన పూర్తి చేసి విడుదల చేయడం, ⁠పోలీస్ బ్రాస్ బ్యాండ్స్, పైప్ బ్యాండ్స్ పునరుద్ధరణ, ⁠రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. ⁠

ఆల్ ఇండియా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ, ⁠రాష్ట్ర వార్షిక శిక్షణ క్యాలెండర్ రూపకల్పన, ⁠పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఇందుకు సంబంధించి అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు, ప్రతి పనిని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని సీవీ ఆనంద్ ఆదేశించారు.

Also Read : కేసీఆర్ ఎప్పుడొస్తారంటే!.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>