కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి సీతక్క (Seethakka) గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో చేసిన కృషికి గుర్తింపుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ అందించే ఈ అవార్డును హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సీతక్కకు అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. పదో తరగతిలో చదువు ఆపేసిన తాను పట్టుదలతో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేసి పీహెచ్‌డీ పూర్తి చేసినట్లు వివరించారు. విద్య అనేది ఎవరూ దొంగలించలేని శాశ్వత ఆస్తి అని, ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని, చదువే మనలో ఆత్మగౌరవాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. అలాగే పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు.

