‘ఐ యామ్ గేమ్’ ట్రైలర్‌కు ఎన్టీఆర్ ఫిదా!

కలం, సినిమా : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న’ఐ యామ్ గేమ్’ (Im Game) సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ట్రైలర్‌పై మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఎన్టీఆర్.. ‘ఐ యామ్ గేమ్’ ట్రైలర్‌లోని ఫైరీ వైబ్ అద్భుతంగా ఉంది. మొదటి నుంచి చివరి వరకు ఎంతో గ్రిప్పింగ్‌గా, ఆసక్తికరంగా సాగింది. నా సోదరుడు దుల్కర్ మరోసారి ప్రత్యేకమైన చిత్రంతో వస్తున్నాడనే నమ్మకం ఉంది. ఈ ప్రయత్నం తప్పకుండా విజయవంతం అవుతుంది. దుల్కర్‌తో పాటు మొత్తం చిత్రబృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ ప్రశంసలతో చిత్రబృందంలో మరింత ఉత్సాహం నెలకొంది. RDX ఫేమ్ నహాస్‌ హిదాయత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో (Im Game) క్యూట్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మిస్కిన్, ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథన్, వినయ్ ఫోర్ట్, ఖాతిర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దుల్కర్‌ సొంత నిర్మాణ సంస్థ వేఫరర్‌ ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీ.. ఓనం కానుకగా ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>