సెప్టెంబర్ 17పై బీజేపీ పోరు.. కరీంనగర్‌లో భారీ తిరంగా ర్యాలీ

కలం, కరీంనగర్ బ్యూరో: సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర బీజేపీ (BJP) పిలుపు మేరకు కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో మంగళవారం భారీ తిరంగా బైక్ ర్యాలీ (Tiranga Bike Rally) నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో గీతాభవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కమాన్ సర్కిల్, ధోబివాడ, ఎల్‌ఐసీ కార్యాలయం, భగత్‌సింగ్ విగ్రహం చౌరస్తా మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది. ర్యాలీలో బీజేపీ కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని త్రివర్ణ పతాకాలు చేతబూని ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సాయిని మల్లేశం, పార్టీ నాయకులు కలెక్టరేట్‌కు చేరుకుని సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

‘ప్రజా పాలన దినోత్సవం’ ఎందుకు?: సాయిని మల్లేశం

ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన దినోత్సవం’గా నిర్వహించడాన్ని తప్పుపట్టారు. రజాకార్ల నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన చారిత్రక రోజైన సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంలో ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తోందో స్పష్టం చేయాలని కోరారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజును గుర్తించి ప్రతి ఏటా అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ఉన్న ఇబ్బందులను ప్రజలకు వివరించాలని సాయిని మల్లేశం డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వై.సునీల్ రావు, మాజీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు, సీనియర్ నాయకులు కన్నెబోయిన ఓదెలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇనకొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, పార్లమెంట్ కన్వీనర్, కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, గుజ్జ శ్రీనివాస్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు కన్న కృష్ణ, ఎర్రబెల్లి సంపత్ రావు, జిల్లా కార్యదర్శులు చేపూరి సత్యం, సీహెచ్ నరసింహరాజు, దండు కొమరన్న, వైద రామానుజం, కార్పొరేటర్లు మాసం గణేష్, తోట అనిల్, ఎన్నం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.అలాగే బీజేపీ, బీజేవైఎం, ఓబీసీ మోర్చా, వివిధ మోర్చాల జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>