కలం, మహబూబాబాద్ : మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా పేట మండల కేంద్రంలోని మధుర వైన్స్ ఎదుట యాకయ్య–స్వాతి అనే దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అధికారులు తమపై దాడి చేసి రూ.40 వేల విలువైన మద్యం సీజ్ చేశారని ఆరోపిస్తూ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. బెల్ట్ షాప్ నిర్వహణకు సంబంధించి అధికారులు తమపై చర్యలు తీసుకున్నారని దంపతులు ఆరోపించారు. వైన్ షాప్‌లోనే మద్యం కొనుగోలు చేసి వారి అనుమతితోనే విక్రయిస్తున్నామని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.

