స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టర్

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి అధికారులు నిరంతరం కృషి చేస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం జిల్లా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అర్హులైన ప్రతి మహిళ స్వయం సహాయక సంఘాల్లో చేరే విధంగా చూడాలన్నారు.

మహిళా సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మంజూరు చేసిన రుణాలు, మొత్తం రుణ లక్ష్యం, రుణాల తిరిగి చెల్లింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రుణ మంజూరు లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలన్నారు. మహిళా సంఘాలకు రుణాలు అందించి, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలని చెప్పారు. మహిళా సంఘాలకు రుణాలు అందిస్తే స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదుగుతారని చెప్పారు.

ఎస్ హెచ్ జి మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని వివరించారు. డిజిటల్ చెల్లింపులలో వారిని ప్రోత్సహించాలని తెలిపారు. రుణాల తిరిగి చెల్లింపులో డిజిటల్ మాధ్యమాలు వినియోగించేలా వారికి శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ విజయలక్ష్మి, ఎల్డీఎం రామ్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>