సాగర్‌లో గుర్తుతెలియని మహిళకు చికిత్స.. పోలీసుల ఆరా

కలం, నాగార్జునసాగర్: నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్‌లోని (Nagarjuna Sagar) కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో గుర్తు తెలియని మహిళకు ఆస్పత్రి సిబ్బంది చికిత్స అందజేస్తున్నారు. సాగర్ ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. పైలాన్ కాలనీ కొత్త బ్రిడ్జి వద్ద సుమారు 30 ఏళ్ల వయస్సున్న మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే 108 వాహనానికి, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మహిళను నాగార్జునసాగర్‌లోని కమల నెహ్రూ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స కోసం చేర్పించారు. గత రెండు రోజులుగా ఆస్పత్రి సిబ్బంది ఆమెకు వైద్యం అందిస్తున్నారు.

మంగళవారం చికిత్స పొందుతున్న సమయంలో మహిళ తన పేరు సుబ్బులు అని తెలిపిందని, అయితే ఇతర వివరాలు చెప్పడం లేదని వైద్యులు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ మహిళను గుర్తుపట్టిన వారు లేదా ఆమెకు సంబంధించిన వివరాలు తెలిసిన వారు సాగర్ పోలీసులను లేదా కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి అధికారులను సంప్రదించాలని పోలీసులు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>