కలం, వెబ్ డెస్క్: కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసినందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (Cyberabad CP) రమేష్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డిలకు తెలంగాణ హైకోర్టు రెండు వారాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున జరిమానా కూడా విధించింది.
ఒక భూ వివాదానికి సంబంధించి పిటిషనర్‌కు తగిన రక్షణ కల్పించాలని గతంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారు. దీనిపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, బాధ్యులైన సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి (Cyberabad CP Ramesh Reddy), మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ శిక్షను ఖరారు చేసింది.
ఈ తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి న్యాయస్థానం వారికి వారం రోజుల గడువు ఇచ్చింది. ఒకవేళ వారం రోజుల్లోగా అప్పీల్‌లో ఎలాంటి ఉపశమనం లభించకపోతే, హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. అంతేకాకుండా, విధించిన జరిమానాను చెల్లించకపోతే అదనంగా మరో వారం రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హైకోర్టు తన ఉత్తర్వుల్లో తెలిపింది.
Also Read : బండి భగీరథ్‌కు షాక్.. కోర్టు కీలక ఆదేశాలు!
Follow Us On: Youtube

