తెలంగాణ‌లో ఐపీఎస్ అధికారుల బ‌దిలీలు!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) శనివారం రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ (IPS Transfers) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో విడుద‌ల చేశారు. ఈ జీవో ప్ర‌కారం 2022, 2023 బ్యాచ్‌కు చెందిన అధికారులకు పదోన్నతులు, కొత్త బాధ్యతలను కేటాయించారు. అసిఫాబాద్ ఏఎస్పీగా ఉన్న ఎస్. చిత్తరంజన్‌ను అదే జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా, కామారెడ్డి ఏఎస్పీగా ఉన్న బొక్క చైతన్య రెడ్డిని సంగారెడ్డి అడిషనల్ ఎస్పీగా, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్‌ను మెదక్ అడిషనల్ ఎస్పీగా బదిలీ చేశారు.

మరికొన్ని కీలక మార్పుల్లో భాగంగా వరంగల్ ఏఎస్పీగా ఉన్న నాగ్రాలే శుభమ్ ప్రకాశ్‌ను నిజామాబాద్ అడిషనల్ డీసీపీ (అడ్మిన్)గా, భైంసా ఏఎస్పీ రాజేష్ మీనాను వనపర్తి అడిషనల్ ఎస్పీగా నియమించారు. నిర్మల్ ఏఎస్పీగా ఉన్న పాతిపాక సాయికిరణ్‌ను భైంసా ఎస్డీపీఓగా, వేములవాడ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రుత్విక్ సాయి కొట్టేను ఉట్నూరు ఎస్డీపీఓగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జనగామ ఏఎస్పీగా ఉన్న పంధేరే చేతన్ నితిన్‌ను జగిత్యాల అడిషనల్ ఎస్పీగా నియమించగా, పి.మౌనిక ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీగా తన బాధ్యతలను కొనసాగించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>