కలం, వెబ్ డెస్క్ : సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఈ-కార్ ఫార్ములా రేస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ-కార్ ఫార్ములా రేస్ (Formula E Car Case) నిధుల మళ్లింపు, నిబంధనల ఉల్లంఘన కేసులో అరవింద్ కుమార్ A2 నిందితుడిగా ఉన్నారు.
ఈ వ్యవహారంలో ఆయనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల అరవింద్ కుమార్‌ను విచారించేందుకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (DOPT) కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సస్పెన్షన్ ప్రక్రియ వేగవంతమైంది. దీనికి సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేయడంతో అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
ప్రస్తుతం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అరవింద్ కుమార్ పట్ల ప్రభుత్వం గత కొంతకాలంగా కఠినంగానే వ్యవహరిస్తోంది. ఇటీవల జరిగిన ఐఏఎస్ అధికారుల భారీ బదిలీల్లో కూడా ప్రభుత్వం ఆయనకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచింది.

