వైఎస్ అవినాష్‌రెడ్డికి పోలీసుల నోటీసులు.. ఎన్నికల వేళ అప్రమత్తం!

కలం, వెబ్​ డెస్క్ : వైఎస్​ఆర్​ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) సందడి మొదలవుతున్న వేళ పోలీసులు అప్రమత్తమయ్యారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వైఎస్​ఆర్​ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి (YS Avinash Reddy) పులివెందుల పోలీసులు నోటీసులు (Police Issue Notice) జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సమయంలో రాజకీయ ఉద్రిక్తతలు, ఘర్షణలు తలెత్తకుండా శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగాలనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీసు సిబ్బంది నేరుగా వైఎస్ అవినాష్‌రెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులను అందజేశారు. అధికారిక సమాచారాన్ని ఆయనకు చేరవేసేందుకు నోటీసు ప్రతిని వాట్సప్ ద్వారా కూడా పంపించారు. దీంతో పులివెందుల రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో నియోజకవర్గవ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు యంత్రాంగం నిర్ణయించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>