రేప‌టి నుంచి గిగ్ వ‌ర్క‌ర్ల నిర‌వ‌ధిక స‌మ్మె!

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణలో గిగ్ వ‌ర్క‌ర్లు (Gig Workers) మ‌రోసారి స‌మ్మె (Strike)కు దిగ‌నున్నారు. త‌మ డిమాండ్లు నెర‌వేర్చాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతూ తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం బంద్ ఇచ్చిన పిలుపు నేప‌థ్యంలో రేప‌టి నుంచి రాపిడో, ఓలా, ఊబ‌ర్ సేవ‌లు నిలిచిపోనున్నాయి. వీటితో పాటు స్విగ్గీ, జొమాటో సేవలు కూడా నిలిపివేస్తున్న‌ట్లు టీఏడీఎఫ్ ప్ర‌క‌టించింది.

సుమారు 4 ల‌క్ష‌ల మంది కార్మికులు ఈ స‌మ్మెలో పాల్గొన‌నున్నారు. త‌మ‌కు క‌నీస చార్జీలు పెంచాల‌ని, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాల‌ని కొన్నేళ్లుగా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గ‌తంలోనే గిగ్ వ‌ర్క‌ర్లు ప్ర‌భుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అయితే ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డంతో స‌మ్మెకు దిగుతున్నారు. రేప‌టి నుంచి క్యాబ్‌లు, ఆటోలు, బైక్‌లు, డెలివ‌రీ సేవ‌ల‌కు అంత‌రాయం క‌లుగుతుంద‌ని డ్రైవ‌ర్స్ ఫోరం వెల్ల‌డించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>