కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కొత్తగా 41 బార్ లైసెన్సుల (Bar Licenses) జారీకి తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనాభా ఆధారంగా నిర్ణయించిన బేసిక్ ఎక్సైజ్ టాక్స్ స్లాబ్ ప్రకారం ఈ దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు అందులో పేర్కొన్నారు. దరఖాస్తు రుసుము రూ.లక్షగా నిర్ణయించారు. లైసెన్స్ మంజూరు, బార్ ఎక్సైజ్ పన్నులు దీనికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎక్సైజ్ పన్ను అనేది జనాభా ఆధారంగా ప్రాంతాలను బట్టి మారుతుంటుంది. అక్టోబర్ 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పొడగింపు ఉండదని.. అర్హులైన వారు త్వరగా అప్లై చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ పేర్కొంది.
జీహెచ్ఎంసీ, సైబరాబాద్ ప్రాంతాల్లో అత్యధికంగా 14 బార్లు కేటాయించారు. మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 27 బార్లు కేటాయించారు. హైదరాబాద్ జనాభా ఆధారంగా స్లాబ్ రేటును అత్యధికంగా రూ.44 లక్షలుగా.. మున్సిపాలిటీల్లో రూ.30 లక్షలుగా నిర్ణయించారు. కొత్త బార్ లైసెన్సుల జారీతో పాటు భవిష్యత్తులో బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా దండిగా ఆదాయం సమకూరబోతుంది.

