ఆర్బీఐ అప్పుల్లో థర్డ్ ప్లేస్.. తొమ్మిది నెలల్లో రూ. 69 వేల కోట్లు

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రిజర్వు బ్యాంకులు అప్పులు తప్పడంలేదు. ఒకదానితో మరొకటి పోటీ పడి ప్రభుత్వాలు ఎడాపెడా అప్పులు చేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసమేనంటూ చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రిజర్వు బ్యాంకు నుంచి ఓపెన్ మార్కెట్ బారోయింగ్ పేరుతో భారీగానే రుణాలు తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలల్లోనూ రూ. 69,300 కోట్ల అప్పు తీసుకున్నది. గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని తీర్చడానికే కొత్తగా అప్పులు చేయాల్సి వస్తున్నదంటూ బహిరంగంగానే సమర్ధించుకుంటున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి క్వార్టర్‌లో ఇంకా ఎంత అప్పు చేస్తుందోననే సందేహం వెంటాడుతూనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులను సహజంగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ పొలిటికల్ విమర్శలకు వాడుకుంటున్నది. ఈ నెల 16 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ అప్పుల గురించి బీఆర్ఎస్ లేవనెత్తే అవకాశమున్నది.

ఎక్కువ అప్పులు తీసుకున్న థర్డ్ స్టేట్ :

రిజర్వు బ్యాంకు నుంచి ప్రతీ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ పేరుతో అప్పు తీసుకోవడం రొటీన్‌గా జరిగే ప్రాసెస్. వార్షిక బడ్జెట్ రూపొందించుకునేటప్పుడే రాష్ట్ర జీడీపీ (జీఎస్‌డీపీ)కి అనుగుణంగా ఆర్బీఐ నుంచి ఎంత లోన్ తీసుకోవాలో రాష్ట్రాలు అంచనా వేసుకుంటాయి. దాన్ని బడ్జెట్‌లో ‘రూపాయి రాక’ కేటగిరీలో పేర్కొంటాయి. ఒక్కోసారి అంచనాకు మించి కూడా అప్పులు చేయడం ఆనవాయితీ. తెలంగాణ సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025-26) రూ. 64,539 కోట్లు తీసుకోవాలని అంచనా వేసుకున్నది. మొత్తం పన్నెండు నెలల్లో దీన్ని తీసుకోవాల్సి ఉన్నది. కానీ తొమ్మిది నెలల్లోనే రూ. 69,300 కోట్లు తీసుకున్నది. అన్నింటికంటే ఎక్కువగా మహారాష్ట్ర రూ. 99,000 కోట్లను, తమిళనాడు రూ. 95,300 కోట్లను తీసుకున్నాయి. ఆ తర్వాత అత్యధికంగా తీసుకున్న రాష్ట్రం తెలంగాణ. జనాభాలో, బడ్జెట్ సైజులో, విస్తీర్ణంలో ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రమే అయినా అది రూ. 34 వేల కోట్లతోనే సరిపెట్టుకున్నది.

Read Also: ఆ ఇద్దరి అనర్హతపై రేపు జడ్జ్‌మెంట్

Follow Us On: Youtube

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>