భారీ సైబర్ మోసం.. డాక్టర్‌ని నమ్మించి దోచేశారు!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం (Cyber Fraud) వెలుగు చూసింది. బిట్ కాయిన్ పేరుతో బోడుప్పల్‌కు చెందిన ఒక డాక్టర్‌ని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.7 కోట్లు దోచేశారు. 2023 నుంచి దశలవారీగా దోపిడీ చేయడం గమనార్హం. ఇక మరో ఘటనలో ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగుల నుంచి ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో రూ.6.55 కోట్లు కొల్లగొట్టారు. కూకట్ పల్లికి చెందిన ఒక రిటైర్డ్ ఉద్యోగికి రూ.2 కోట్లు, ఏఎస్ రావు నగర్‌లో రూ.4.50 కోట్లు మోసం చేశారు. విడతల వారీగా సైబర్ నేరగాళ్లు వీరిని నమ్మించి.. ఖాతాలను ఖాళీ చేశారు.

రకరకాల పెట్టుబడుల పేరుతో వారిని బురిడీ కొట్టించిన నేరగాళ్లు.. మొదట్లో కొంత డబ్బులు ఇస్తూ వలలో వేసుకున్నారు. పూర్తిగా తమ కంట్రోల్‌లోకి వచ్చారని భావించాక.. పెద్ద ఎత్తున దోచుకోవడం మొదలుపెట్టారు. మోసపోయామని ఆలస్యంగా గుర్తించిన బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆన్‌లైన్ మోసాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా.. రూ.కోట్లల్లో డబ్బులు పోగొట్టుకోవడం ఆందోళనంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>