శివధర్ రెడ్డి రిటైర్మెంట్: త్వరలో కొత్త బాధ్యతలు?

కలం, వెబ్‌ డెస్క్‌ : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి (Shivadhar Reddy) నేడు పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఆయనకు ఘనంగా వీడ్కోలు పరేడ్ నిర్వహించారు. ఈ వేడుకలో కొత్త డీజీపీ సీవీ ఆనంద్ తోపాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శివధర్ రెడ్డి అందించిన విశిష్ట సేవలను ప్రభుత్వం కొనియాడింది.

ఎస్ఐబీ విభాగంలో ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించనుంది. శివధర్ రెడ్డిని స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయనకు చీఫ్ సెక్రటరీ హోదాను కల్పించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పోలీసు శాఖలో ఆయన చేసిన కృషిని భవిష్యత్తులోనూ వినియోగించుకోవాలని యోచిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>