కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ (CV Anand)కు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ బాధ్యతాయుతమైన పదవిని సీవీ ఆనంద్ తన అంకిత భావం, చిత్తశుద్ది, నాయకత్వ పటిమతో అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తారన్న నమ్మకం తనకుందని చిరంజీవి పేర్కొన్నారు. సీవీ ఆనంద్ ఈ కొత్త బాధ్యతలో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు చిరంజీవి తన ఎక్ష్ పోస్టులో సీవీ ఆనంద్‌తో గతంలో దిగిన ఓ ఫోటోను కూడా షేర్ చేశారు.

