రేపు ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు.. అత్యవసర సమావేశం!

కలం,‌ వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) నాయకులకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల 12న అత్యవసరంగా సమావేశం కావాల్సి ఉందని.. రేపటి వరకు ఢిల్లీలో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ జరగబోతుంది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఉపాధ్యక్షులు, పార్టీ జనరల్ సెక్రటరీలు, సీనియర్ నేతలు హస్తిన బాట పట్టబోతున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంత్రులకు స్వయంగా ఫోన్లు చేసి ఢిల్లీకి రావాలని సూచించారు. మహేశ్ గౌడ్ రేపు ఉదయమే బయల్దేరి వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు రాత్రి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

అందుకోసమేనా..?

కాంగ్రెస్ అధిష్ఠానం అందరినీ ఢిల్లీకి పిలిపించడం వెనుక బలమైన కారణం ఏమై ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు, రాబోయే రోజుల్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు, వివిధ అంశాల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం, మంత్రి వర్గ విస్తరణ, మరికొన్ని ముఖ్య అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రెండు రోజుల కిందటే ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఇంతలోనే పార్టీ నేతలను మూకుమ్మడిగా ఢిల్లీకి పిలిపించుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read : అడవిలో అద్భుతం.. మంచిర్యాలలో దేశంలోనే తొలి అడ్వెంచర్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>