చదువుతో పాటు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్‌ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Collector Rajarshi Shah) స్పష్టం చేశారు. బుధవారం నార్నూర్ మండలం గంగాపూర్ (జి) గ్రామంలో గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను (Tribal Welfare School) ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని విద్యార్థుల హాజరు శాతం, మౌలిక వసతులను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి బోధనా ప్రమాణాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యంపై వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం అందించాలన్నారు. పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులు, సిబ్బందికి సూచించారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను కలెక్టర్ పరిశీలించి అభినందించారు.

అదేవిధంగా పాఠశాల ఆవరణలోని బోర్ వద్ద ఇంకుడు గుంత నిర్మించాలని ఆదేశించారు. అంతకుముందు గ్రామస్థులు పాఠశాల ఆవరణలో ప్రహరీగోడ నిర్మించాలని, నూతన అంగన్వాడీ భవనం మంజూరు చేయాలని కోరాగా, ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, తహసిల్దార్ రాజలింగు, ఎంపిడిఓ పుల్లయ్య, ఉపాధ్యాయురాలు శోభా, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>