కలం, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీజేపీ (Telangana BJP) తలుపులు తెరుస్తున్నామని, నెల రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని బీజేపీ రాష్ట్ర ఇంచార్జి అభయ్ పాటిల్ (Abhay Patil) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ కీలక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నితిన్ నబీన్ ఆదేశాలతో రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం పని చేస్తున్నట్లు తెలిపారు. నెల రోజుల్లో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని, పార్టీలోకి ఎవరెవరు వస్తారో మీరే చూస్తారని వ్యాఖ్యానించారు.
ఇక బండి సంజయ్, ఈటల రాజేందర్‌ల (Bandi Sanjay – Eatala Rajender) సమావేశం గురించి స్పందిస్తూ ఇది పెద్ద ప్రత్యేకమేమీ కాదని, ఇలాంటి సమావేశాలు రానున్న రోజుల్లో చాలా జరుగుతాయని తెలిపారు. అభయ్ (Abhay Patil) వ్యాఖ్యలతో అసలు రాష్ట్రంలో బీజేపీ ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. కమలం పార్టీలోకి ఎవరెవరు వెళ్తారో కొద్ది రోజుల్లో తేలనుంది.
Read Also: బీసీ ప్లాన్: కమలం పార్టీ కొత్త వ్యూహం!
Follow Us On : WhatsApp

