కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి మారుపేరు : రాంచందర్ రావు

కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి మారుపేరుగా మారిపోయిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు (BJP Chief Ramchander Rao) విమర్శించారు. ఏళ్లుగా కాంగ్రెస్ దేశాన్ని దోచుకుంటోందని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భారీ కుంభకోణం వెలుగు చూసిందని గుర్తు చేశారు. పరీక్షా పత్రాల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టారన్నారు. అప్పటి కాంగ్రెస్ సీఎం పీఏ ద్వారానే ఈ బాగోతం బయటపడిందని చెప్పారు.

అలాగే, కర్ణాటకలో అవినీతి కారణంగా కాంగ్రెస్ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని రాంచందర్ రావు గుర్తు చేశారు. అనంతరం పీడబ్ల్యూడీ మంత్రిపై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయని.. కర్ణాటకలో అవినీతితో పాటు మైనింగ్‌కు సంబంధించిన అక్రమాల ఆరోపణలూ వెల్లువెత్తాయని విమర్శించారు. ఉత్తరాఖండ్ , కర్ణాటక లోని కాంగ్రెస్ ప్రభుత్వాలతో పాటు తెలంగాణలోని కాంగ్రెస్ పాలనలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఆయన (Ramchander Rao) ఆరోపించారు.

తెలంగాణలో సీఎంతో పాటు పలువురు మంత్రులు, ప్రబుత్వంలోని కీలక వ్యక్తులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో హిల్ట్, హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున్న కుంభకోణాలు, భారీ అవినీతి దందా నడుతస్తోందని రాంచందర్ రావు ఆరోపించారు. రాహుల్ గాంధీ ఒకవైపు “మొహబ్బత్ కీ దుకాణ్” అంటూనే, మరోవైపు మతం పేరుతో దేశంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అవినీతిపై బీజేపీ తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>