కలం, వలిగొండ : వలిగొండ మండల కేంద్రంలో వైఎస్‌సీఏ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహం వద్ద ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి(SI Srikanth Reddy) మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించి ఆశీర్వాదాలు కోరారు. ఈ సందర్భంగా వైఎస్‌సీఏ యూత్ సభ్యులు ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ పూజా కార్యక్రమంలో విగ్రహ దాత గంగాపురం సతీష్ గౌడ్, కల్పన, జాల వలిభాష, పల్సం రాజు, కొండూరు అంజయ్య, గంగాపురం బుచ్చిబాబు, వెల్లంకి కొండలు, పబ్బు స్వామి, రచ్చ గణేష్, కొండూరు సాయి, పబ్బు వెంకన్న, కొండూరి భాస్కర్, ఆజాం, బిక్షపతి, పబ్బు దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

