కొండా సురేఖకు మరో షాక్ .. సచివాలయంలో ఛాంబర్ల సీజ్

కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సచివాలయంలోని మాజీ మంత్రి కొండా సురేఖకు కేటాయించిన గదులకు అధికారులు తాళం వేశారు. ఈ మేరకు సచివాలయంలోని 4వ అంతస్తులోని 4వ విభాగంలో గల 10,11,12 నంబర్ కార్యాలయ గదులను అధికారులు సీజ్ చేశారు. ఛాంబర్ దగ్గర నేమ్ బోర్డును తీసేసిన జీఏడీ అధికారులు.. ఆమె పేషీలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి పలువురిని స్టాఫ్‌ పేరెంట్ డిపార్టుమెంటుకు బదిలీ చేసింది.

కాగా, ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమండ్ కొండా సురేఖ(Konda Surekha)పై వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆమెను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆమెకు కేటాయించిన చాంబర్లను సచివాలయం అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని వాటికి తాళం వేయడం చర్చనీయాంశంగా మారింది.

Also Read : కేసీఆర్ నివాసం వద్ద పసుపు నీళ్ల ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>