Mobile Popup Ad
Mobile Popup Ad

శ్రీలంక‌లో పెట్రోల్‌ సంక్షోభం.. వాహ‌నాల‌కు లిమిటెడ్‌గా స‌ర‌ఫ‌రా!

క‌లం, వెబ్ డెస్క్‌: మిడిల్ ఈస్ట్‌లో జ‌రుగుతున్న యుద్ధం ప్ర‌పంచ దేశాల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తోంది. ఇప్ప‌టికే భార‌త్‌లో గ్యాస్ కొర‌త వేధిస్తుండ‌గా శ్రీలంక‌ (Sri Lanka)లో ఇంధన సంక్షోభం మొద‌లైంది. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహ‌నాలు క్యూ క‌డుతున్నాయి. ఈ క్రమంలోనే ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇంధ‌న కొర‌త‌ను, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇంధన కోటా వ్యవస్థను ప్రారంభించింది. ఈ విధానంలో కార్లకు 15 లీటర్లు, బైక్స్‌కి 5 లీటర్లు మాత్రమే ఇంధన సరఫరా చేస్తున్నారు. దీనికి క్యూఆర్ ఆధారిత పంపిణీ వ్యవస్థను అనుస‌రిస్తున్నారు. అన్ని వాహ‌నాల‌కు పరిమితంగానే ఇంధనం సరఫరా జ‌రుగుతోంది. దీంతో శ్రీలంక వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద జ‌నం వాహ‌నాల‌తో బారులు తీరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>