కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi).. విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభిమానులలో ఉత్సాహం మరింత పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రీమియర్ షోలను రేపు రాత్రి నుంచే ప్రదర్శించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. నైజాం ప్రాంతంలో టికెట్ రేట్లు పెంచినా, పెంచకపోయినా రేపు రాత్రికే ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యేలా ప్లానింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే థియేటర్లతో పాటు డిస్ట్రిబ్యూషన్ వర్గాలు కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో ‘పెద్ది’ సినిమాకు టికెట్ రేట్ల పెంపునకు సంబంధించిన జీవో విడుదల కావడంతో అభిమానులలో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయా లేదా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయినప్పటికీ ప్రీమియర్ షోల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ‘పెద్ది’ తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

