Mobile Popup Ad
Mobile Popup Ad

కల్తీ నెయ్యిలో ఏ1 జగన్: ఎమ్మెల్సీ అనురాధ‌

క‌లం, వెబ్ డెస్క్‌: తిరుమ‌ల ల‌డ్డూ (Tirumala Laddu) అంశంతో మ‌రోసారి ఏపీ శాస‌న మండ‌లి హీటెక్కింది. క‌ల్తీ నెయ్యిపై గంట‌పాటు జ‌రిగిన చ‌ర్చ‌లో కూట‌మి స‌భ్యులు గ‌త ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ (TDP MLC Anuradha) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. క‌ల్తీ నెయ్యి దోషులెవ‌రో ప్ర‌జ‌లు ఇప్ప‌టికే నిర్ణ‌యించార‌ని ప్ర‌క‌టించారు. వైసీపీ దొంగ‌లే క‌ల్తీకి పాల్ప‌డ్డార‌ని వ్యాఖ్యానించారు. క‌ల్తీ నెయ్యిలో ఏ1 జ‌గ‌న్ అని, ఏ2 భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, ఏ3 వైవీ సుబ్బా రెడ్డి అని, ఏ4 చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి అని ఆరోపించారు. ఇది ప్ర‌జ‌లే నిర్ణ‌యించార‌ని అనురాధ‌ చెప్పారు.

దీనిపై చైర్మ‌న్ స్పందిస్తూ.. మీరేమీ పోలీసులు, సీబీఐ కాద‌ని, ఇలా నేర‌స్థుల‌ను నిర్ణ‌యించ‌డం త‌గ‌ద‌ని సూచించారు. దీన్ని రికార్డుల్లో నుంచి తొల‌గించాల‌ని చైర్మ‌న్ ఆదేశించారు. మ‌రోవైపు వైసీపీ నాయ‌కులు హెరిటేజ్‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, దీనికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Read Also: టీటీడీ ప్ర‌తిష్ట‌ను కాల‌రాస్తున్న చంద్ర‌బాబు: వైఎస్‌ జ‌గ‌న్‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>