కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) విజయవాడ చేరుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి ఏపీ పర్యటనకు వచ్చిన విజయ్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో మంత్రి నారాయణ, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. తమిళ సంప్రదాయ పంచెకట్టులో విజయవాడకు వచ్చిన విజయ్.. ఎయిర్‌పోర్టు బయట తన కోసం ఎదురు చూస్తున్న అభిమానులు, టీవీకే మద్దతుదారులకు నమస్కారం పెట్టారు.
అనంతరం సీఎం విజయ్ ఇంద్రకీలాద్రి కొండపై దుర్గమ్మ దర్శనానికి బయల్దేరి వెళ్లారు. ఆలయానికి చేరుకున్న వెంటనే సీఎంకు పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం నేరుగా సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకోనున్నారు. సీఎం చంద్రబాబుతో కృష్ణా జలాల అంశంతో పాటు ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్ని ఇతర సమస్యలపైనా చర్చించబోతున్నారు. సీఎంతో భేటీ ముగిశాక విజయవాడలో జరిగే దసరా మహోత్సవ్ 2.0 కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక తిరిగి చెన్నై వెళ్లనున్నారు.

