మందరికల్‌పాడులో కనుజు వేట కలకలం.. నిఘా పెంచాలని డిమాండ్!

కలం, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని మందరికల్‌పాడు (Manderikalapadu) గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఒక అడవి కనుజు, వేటగాళ్ల బారిన పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి సుమారు 1 గంట నుంచి 2 గంటల మధ్య ఈ వేట జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో సుమారు ఎనిమిది మంది వరకు పాల్గొని, సుమారు 125 కిలోల బరువున్న అడవి కనుజును వేటాడి చంపినట్లు తెలుస్తోంది. ​మందరికల్‌పాడు గ్రామ పరిసరాల్లో అటవీ ప్రాంతం, ఆర్‌ఓఎఫ్ (అటవీ పట్టా) భూములు, వ్యవసాయ భూములు కలిసి ఉండటంతో వన్యప్రాణులు తరచూ గ్రామ శివార్లకు వస్తుంటాయి.

దీనిని ఆసరాగా చేసుకుని కొందరు వేటగాళ్లు అక్రమంగా వన్యప్రాణి వేటకు పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి, అక్రమ వేటకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మందరికల్‌పాడు గ్రామస్తులు కోరుతున్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ ప్రాంతం, శివారు భూముల వద్ద నిఘా పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>