డ్యూటీలో త‌మ్ముడు.. బ‌స్సు ఆపి రాఖీ క‌ట్టిన అక్క‌!

క‌లం, వెబ్‌డెస్క్: రాఖీ పండుగ (Raksha Bandhan) రోజు క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవ‌ర్‌గా విధుల్లో ఉన్న త‌మ్ముడికి బ‌స్సు ఆపి ఓ అక్క రాఖీ క‌ట్టిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న తిమ్మాపూర్ మండ‌లం రేణిగుండ వ‌ద్ద చోటు చేసుకుంది. రాజు టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. నేడు రాఖీ పండుగ రోజు కూడా డ్యూటీ ఉంది. గోదావ‌రిఖ‌ని నుంచి హైద‌రాబాద్‌కు బ‌స్సు న‌డుపుతున్నాడు. ఈ క్ర‌మంలో త‌న అక్క‌తో రాఖీ క‌ట్టించుకునే అవ‌కాశం లేకుండా పోయింది.

కానీ, రాజు అక్క స్వ‌ప్న మాత్రం త‌మ్ముడికి ఎలాగైనా రాఖీ క‌ట్టాలి అని నిర్ణ‌యించుకుంది. గోదావ‌రిఖ‌ని నుంచి హైద‌రాబాద్‌కు బ‌స్సులో వెళ్తున్న రాజు త‌న ఊరి వ‌ద్ద‌కు రాగానే బ‌స్సును ఆపింది. బ‌స్సులో డ్రైవింగ్ సీటులో ఉండ‌గానే నుదుటున కుంకుమ పెట్టి, చేతికి రాఖీ క‌ట్టింది. అక్క త‌మ్ముళ్ల ఆప్యాయ‌త చూసి బ‌స్సులో ఉన్న జనం సైతం సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ వేడుక‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>