నిజామాబాద్‌లో ఘనంగా తైక్వాండో బెల్ట్ అవార్డింగ్

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్‌ (Nizamabad)లో తైక్వాండో బెల్ట్ అవార్డింగ్ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. వినాయక్ నగర్‌ బస్వా గార్డెన్‌లో అమెచ్యూర్ తైక్వాండో (Taekwondo) అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జ‌రిగింది. ముఖ్య అతిథిగా అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దుర్గా ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. తైక్వాండో వంటి క్రీడలు నేర్చుకోవడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ మంచి వ్యక్తిత్వం పెరుగుతాయని, శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతారని తెలిపారు. చదువుల్లో కూడా వారు ముందుంటారని చెప్పారు. పిల్లలను క్రమం తప్పకుండా శిక్షణకు పంపిస్తున్న తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులందరూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కోచ్ మనోజ్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో తైక్వాండో అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య, బ్లాక్ బెల్ట్ సభ్యులు గంగాధర్, నాగరాజ్, నాగరాణి, సిద్ధార్థ, గోపీకృష్ణ, సుమిత్, సాయిరామ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>