కలం, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup) క్రైమాక్స్ దశకు చేరుకుంది. ఈ టోర్నీలో అత్యంత కీలకమైన తొలి సెమీఫైనల్ మ్యాచ్ బుధవారం జరగనుంది. ఇందులో దక్షిణాఫ్రికా, న్యాజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్‌కు వెళ్తారు. ఓడిన వారు ఇంటిబాట పడతారు. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ఈ సమయంలో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Santner) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సఫారీలతో సమరానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తమ జట్టుపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
ఈ టోర్నీలో ఇరు జట్లు రెండు వారాల క్రితమే తలపడగా, ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. చరిత్ర పరంగా కూడా టీ20ల్లో కివీస్‌పై దక్షిణాఫ్రికాదే పైచేయిగా ఉంది. అయితే, ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం న్యూజిలాండ్‌కు తిరుగులేని రికార్డు ఉంది. గతంలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగిన మూడు నాకౌట్ మ్యాచుల్లోనూ కివీస్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించడం విశేషం. పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం కోసం తాము ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశామని సాంట్నర్ పేర్కొన్నారు.
సౌతాఫ్రికా బ్యాటర్లు పవర్‌ప్లేలో చాలా వేగంగా ఆడతారని, వారిని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో తాము అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేదని, కానీ సెమీస్‌లో అంతా కలిసికట్టుగా రాణిస్తే విజయం తమదేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని, ఇక్కడ 220 పరుగుల కంటే 180 పరుగులు చేయడం కూడా మంచి స్కోరు కావచ్చని సాంట్నర్ విశ్లేషించారు. గ్రౌండ్ కొలతలను బట్టి తమ బౌలింగ్ వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటామని చెప్పారు. ప్రత్యర్థి జట్టులో పవర్‌ఫుల్ మిడిల్ ఆర్డర్ ఉన్నందున, వారిని కట్టడి చేయడం తమ బౌలర్లకు అతిపెద్ద సవాలుగా మారనుందని సాంట్నర్ (Santner) చెప్పుకొచ్చాడు.

