స్వరా భాస్కర్‌కు డైరెక్ట‌ర్‌ లైంగిక వేధింపులు!

క‌లం, సినిమా: బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ (Swara Bhasker) తన సినీ కెరీర్ స్టార్టింగ్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తాజాగా బయటపెట్టారు. 2011లో ఓ సినిమా షూటింగ్ సమయంలో ఆ చిత్ర దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వరా భాస్కర్ ఈ విషయాలను వెల్లడించారు. “2011లో ‘తను వెడ్స్ మను’ చిత్రం విడుదలైన కొత్తలో 20 ఏళ్ల వయసులో ఉన్న తాను మధ్యప్రదేశ్‌లోని పచ్మఢీలో జరిగిన మరో సినిమా షూటింగ్‌లో పాల్గొన్న‌ట్లు చెప్పారు. 56 రోజుల పాటు సాగిన ఈ అవుట్ డోర్‌ షెడ్యూల్ ప్రారంభమైన కొద్ది రోజులకే దర్శకుడి నుంచి వేధింపులు మొదలయ్యాయ‌న్నారు.

అప్పట్లో త‌న‌కు ఇండస్ట్రీలో ఎలాంటి పరిచయాలు గానీ, సొంతంగా పీఆర్ బృందం గానీ లేకపోవడంతో చాలా బలహీన స్థితిలో ఉన్న‌ట్లు చెప్పారు. కెరీర్‌కు ఉపయోగపడే సినిమా కావడంతో, పని పోతుందనే భయంతో ఆ 56 రోజుల పాటు మౌనంగా భరించాల్సి వచ్చింద‌ని చెప్పుకొచ్చారు. ఆ దర్శకుడు త‌న‌ను ఫిజిక‌ల్‌గా ట‌చ్ చేయ‌క‌పోవ‌డం వల్ల, పని ప్రదేశంలో జరుగుతున్న ఆ అసభ్య ప్రవర్తనను లైంగిక వేధింపుగా అప్పట్లో గుర్తించలేకపోయాన‌ని గుర్తు చేస‌కున్నారు. కొన్నేళ్ల తర్వాత ‘మీటూ’ ఉద్యమం మొదలై, బాధిత మహిళల అనుభవాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే త‌న‌కు జరిగింది కూడా లైంగిక వేధింపేనని స్పష్టంగా అర్థమైంద‌న్నారు. ఆ క్లిష్ట సమయంలో ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ త‌న‌ పరిస్థితిని అర్థం చేసుకుని, షూటింగ్ పూర్తయ్యే వరకు త‌న‌కు రక్షణగా నిలిచార‌ని స్వరా భాస్కర్ గుర్తు చేసుకున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి సినీ ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>