కలం, వరంగల్ బ్యూరో: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కార్యాలయంలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు (Vigilance Raids) చేపట్టారు. కార్పొరేషన్ పరిధిలో అపార్ట్‌మెంట్ల నిర్మాణాలకు సంబంధించి అడ్డగోలుగా, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తున్నారని ఆరోపిస్తూ పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

