Mobile Popup Ad
Mobile Popup Ad

హుజూర్‌నగర్‌లో బాలుడి అనుమానాస్పద మృతి

కలం, హుజూర్‌నగర్ : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ (Huzurnagar) లో 13 ఏళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి పూర్తి చేసిన కె. కార్తీక్ (13) ఆదివారం తన నివాసంలో విగతజీవిగా కనిపించాడు. కాగా, తాను బయట నుంచి వచ్చే సరికే ఆత్మహత్య చేసుకున్నాడని బాలుడి తండ్రి కోటేశ్వరరావు చెబుతున్నారు. మరోవైన తన కొడుకును కోటేశ్వర రావే హత్య చేశారని తల్లి ఆరోపిస్తోంది. సమచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. హత్య, ఆత్మహథ్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>