సైలెంట్‌గా పెళ్లి చేసేసుకున్న మ‌రో టాలీవుడ్ హీరోయిన్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి పీట‌లెక్కేసింది. మీడియాకు ఎలాంటి హింట్లు ఇవ్వ‌కుండా సైలెంట్‌గా పెళ్లి చేసేసుకుంది. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అందాల తార మెహ్రీన్ ఫిర్జాదా (Mehreen Pirzadaa) ఆదివారం రాత్రి అర్ష్ ఔలఖ్‌(Arsh Aulakh) అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. పెళ్లికి సంబంధించిన ఫొటోల‌ను పోస్ట్ చేసింది. గ‌తంలోనే మెహ్రీన్‌కు ఓ మాజీ సీఎం మ‌న‌వ‌డితో ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. ఏమైందో తెలియ‌దు ఆ ఎంగేజ్‌మెంట్ పెళ్లి వ‌ర‌కూ వెళ్ల‌లేదు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకున్న అర్ష్ గురించి ఎప్పుడూ మెహ్రీన్ బ‌హిరంగంగా చెప్ప‌లేదు. ల‌వ్‌, ఎంగేజ్‌మెంట్ వంటి విష‌యాలు కూడా బ‌య‌ట‌కు రాలేదు. ఇక అస‌లు ఇది ప్రేమ వివాహ‌మా? లేక పెద్ద‌లు కుదిర్చిన వివాహ‌మా? అనేది కూడా క్లారిటీ లేదు. అయితే మెహ్రీన్ పోస్టు బ‌ట్టి చూస్తే ఇది ప్రేమ వివాహ‌మే అని తెలుస్తోంది. ఇక స‌డెన్‌గా మెహ్రీన్ చేసిన పోస్టు చూసి నెటిజ‌న్లు షాక‌య్యారు. సెల‌బ్రెటీల నుంచి సామాన్యుల వ‌ర‌కు మెహ్రీన్‌కు కామెంట్ల‌లో విషెస్ చెప్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>