గద్వాల‌ జిల్లా కేంద్రంలో కారు బీభత్సం

కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల‌ జిల్లా‌ కేంద్రంలోని ప్లై ఓవర్ పై ఆదివారం రాత్రి కారు నడిపిన వ్యక్తి బీభత్సం (Gadwal Car Accident) సృష్టించాడు. ఆదివారం రాత్రి కారు నడుపుతున్న వ్యక్తి గద్వాల నుంచి‌ కర్నూల్ వైపు ప్లై ఓవర్ మీదుగా వేగంగా వెళ్తున్న క్రమంలో కారును సడెన్ గా గద్వాల వైపు తిప్పడంతో కారు అదుపుతప్పి డీవైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. కారు నడుపుతున్న వ్యక్తి కారును వదిలేసి అక్కడ నుంచి పరారైనట్లు తెలుస్తోంది.

అతివేగం, మద్యం కారణమా!

అయితే కారు నడిపిన వ్యక్తి పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు‌. అతివేగం, మద్యం మత్తే కారణమని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. అయితే కారు వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం రంగాపురం గ్రామానికి చెందింది గా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదం చేసిన వ్యక్తులు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరుగలేదు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>