కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు, కర్ణాటక మధ్య నెలకొన్న కావేరి జల వివాదంలో (Kaveri Water Dispute) కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కావేరి అథారిటీ ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
కాగా, కావేరి జలాల విడుదలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కావేరి అథారిటీ ఆదేశాలను పాటిస్తూ తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని సూచించింది. 12 రోజుల పాటు 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read : సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..!
Follow Us On : WhatsApp

