విజయ్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. దీపారాధనకు సుప్రీం గ్రీన్ సిగ్నల్!

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మధురై తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీప స్తంభంపై ఈ ఏడాది దీపం (Thiruparankundram lamp) వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన ఈ తీర్పు పట్ల హిందూ ధార్మిక సంస్థలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధురైలోని తిరుప్పరంకుండ్రం ఆలయం వద్ద హిందూ మున్నని సభ్యులు సంబురాలు జరుపుకున్నారు.

సుప్రీంకోర్టు అనుమతి లభించిన వెంటనే ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న హిందూ మున్నని కార్యకర్తలు, నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు, స్థానికులకు స్వీట్లు పంపిణీ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. కార్తీక దీపం వేడుకల సందర్భంగా దీప స్తంభంపై దీపం వెలిగించేందుకు మార్గం సుగమం కావడంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది.

Also Read : ప్రాజెక్టు చీతాలో మరో మైలురాయి.. 4 కూనలకు జన్మనిచ్చిన చిరుత!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>